ప‌వ‌న్ మేన‌రిజ‌మ్‌తో సంద‌డి చేసిన మెగాస్టార్‌

By Newsmeter.Network  Published on  27 Nov 2019 6:33 AM GMT
ప‌వ‌న్ మేన‌రిజ‌మ్‌తో సంద‌డి చేసిన మెగాస్టార్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మేన‌రిజం అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది... తన చేతిని మెడ మీద రుద్దడం. ఇది ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలిసిందే. అయితే... 'అర్జున్ సూరవరం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేన‌రిజ‌మ్‌ని చేసి చూపించి అభిమానుల్లో ఉత్సాహం క‌లిగించారు.

ఈ వేడుక‌లో చిరు మాట్లాడుతూ...

సినిమాలో చే గువేరా ఫోటో చూసినప్పుడల్లా, నా సోదరుడు పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడన్నారు. నిఖిల్ 'అర్జున్ సూరవరం' అందరూ చూడాల్సిన సినిమా అని అన్నారు. ఖ‌చ్చితంగా ఈ సినిమా విజ‌యం సాస్తుంద‌ని ఆశిస్తున్నాను అని అన్నారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ సూరవరం' మూవీకి టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించారన్నారు. ఈ చిత్రం నవంబర్ 29 న విడుదలవుతోందని తెలిపారు

Next Story
Share it