వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విటర్ బాంబ్ లు పేల్చారు. ఏ కొత్త ప్రభుత్వమైనా శుభంతో మొదలు పెడతారు.  కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు చేసుకుంటారు. కాని..వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్లు కూల్చివేతలు, పెట్టుబడులు రద్దు మీద దృష్టి పెట్టింది. భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసింది. ఆశా వర్కర్లకు రోడ్డుమీదకు తీసుకొచ్చింది . కేసులు పెట్టించింది. అమరావతి రాజధాని లేకుండా చేయాలి చూడటం అంటూ ట్విట్ లు చేశారు. అంతేకాదు..ఇలాంటి  ఆలోచనలు ఉన్న వారికి కరెంట్ మీద దృష్టి ఏముంటుందన్నారు పవన్ కల్యాణ్. స్టేట్ లో 55 యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. అందుకే కరెంట్ కోతలు  అని చెప్పారు. దీనిని దసరా కానుకగా భావించాలా అని ప్రశ్నించారు జనసేన అధినేత.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.