పవర్ ఫుల్  ఫైట్ తో  పవన్ కళ్యాణ్ రీఎంట్రీ !

By సుభాష్  Published on  20 Jan 2020 4:36 PM GMT
పవర్ ఫుల్  ఫైట్ తో  పవన్ కళ్యాణ్ రీఎంట్రీ !

'పింక్' రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్ వేదికగా వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. మొదటి రోజే పవన్ కళ్యాణ్ మీద ఒక ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారట. సినిమా కూడా ఈ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ రాజకీయపరమైన పనుల్లో పడి పూర్తిగా తన లుక్ మీద కంట్రోల్ తప్పారు. మరి సినిమాలో ఆయన ఎలాంటి లుక్ లో కనిపిస్తారో చూడాలి. ఇప్పటివరకూ అయితే పవన్ మాత్రం తన లుక్ ఛేంజ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. మరి మేకప్ తో కవర్ చేస్తారేమో. తెలుస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

Next Story
Share it