ఆపరేషన్ మధ్యలో.. ఆమె ఏం చేసిందంటే..!

By అంజి  Published on  20 Feb 2020 3:21 AM GMT
ఆపరేషన్ మధ్యలో.. ఆమె ఏం చేసిందంటే..!

సంగీతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనల్ని మార్చే మంత్రం. సంగీతం నొప్పిని కూడా తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. వివిధ రకాల సర్జరీలు చేయించుకున్నవారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. అయితే ఇవన్నీ అట, అట అనే గానీ నిజంగా అనుభవించినవారు ఉన్నారా లేదా అన్నది ఇప్పటివరకు అనుమానం గా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ డౌట్ తీరిపోయింది. డాక్టర్లు బ్రెయిన్‌​ సర్జరీ చేస్తుండగానే ఓ పెషేంట్ వయొలిన్‌ వాయించిన ఘటన బ్రిటన్‌ ఆసుపత్రిలో జరిగింది.

లండన్‌కు చెందిన 53 ఏళ్ల డాగ్మార్‌ టర్నర్‌ అనే మహిళ గత కొంతకాలంగా అరుదైన బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతోంది. దీంతో బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ ఆస్పత్రి న్యూరో సర్జన్‌ కీమౌర్స్ అష్కాన్ వద్ద ట్యూమర్‌కు సంబంధించి చికిత్స తీసుకుంటోంది. అయితే ట్యూమర్‌ మెదడు కుడి భాగం మొత్తం విస్తరించడంతో వెంటనే ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ తొలగించుకోవాలని, లేకపోతే ప్రాణం పోతుందని కీమౌర్స్ అష్కాన్ సూచించారు.

అయితే ఆపరేషన్‌ కి ఒకే గానీ ఆ సమయంలో తనకు వయొలిన్‌ వాయించడానికి అనుమతి ఇవ్వాలని టర్నర్‌ డాక్టర్ లను కోరింది. మొదట ఆమె విన్నపాన్ని వైద్యులు తోసిపుచ్చారు. తర్వాత ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టంతో కాదనలేకపోయారు. ఆపరేషన్‌ సమయంలో ఆమెకు మత్తు ఇవ్వకుండానే బ్రెయిన్‌లోని ట్యూమర్‌ను తొలగించారు. కణితిని తొలగించినంత సేపూ ఆమె ఎడమ చేతిలో వయొలిన్‌ పట్టుకుని కుడిచేతితో వాయించిన తీరు వారినే కాదు సోషల్ మీడియాలో చాలామందిని కదిలిస్తోంది. ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఆపరేషన్‌ సయయంలో పేషంట్‌ ఇలా సంగీత పరికరం వాయించడం తన కెరీర్‌లో ఇదే మొదటిసారి అని డాక్టర్స్ చెబుతుండగా, ఆపరేషన్ సమయంలో తనకు వయోలిన్ వాయించే అవకాశం కల్పించిన సర్జన్లకు టర్నర్ ధన్యవాదాలు తెలిపింది.



Next Story