కోవిడ్-19కు పతంజలి చెక్‌.. హరిద్వార్‌లో కరోనా మెడిసిన్‌ విడుదల చేసిన రాందేవ్‌బాబా

By సుభాష్  Published on  23 Jun 2020 7:22 AM GMT
కోవిడ్-19కు పతంజలి చెక్‌.. హరిద్వార్‌లో కరోనా మెడిసిన్‌ విడుదల చేసిన రాందేవ్‌బాబా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. పతంజలి నుంచి కనుగొన్న మెడిసిన్‌ను హరిద్వార్‌ పతంజలి యోగా పీఠ్‌ వేదికగా మంగళవారం యోగా గురువు రాందేవ్‌బాబా విడుదల చేశారు. అంతకు ముందు ఈ మెడిసిన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు పతంజలి సీఈవో బాలకృష్ణ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని నమ్ముతున్నామని బాలకృష్ణ అన్నారు. దీంతో హరిద్వార్‌లోని పతంజలి యోగా పీఠ్‌ వేదికగా ఈ మెడిసిన్‌ విడుదల చేసి శాస్త్రీయత గురించి తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా మాట్లాడుతూ.. పతంజలి మెడిసిన్‌తో కరోనా రోగి 4-5 రోజుల్లో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మెడిసిన్‌కు స్వసరీ వాటి, కరోనిల్‌ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ మెడిసిన్‌ కరోనా చికిత్స కోసం 15 నుంచి 50 ఏళ్ల వయసున్నవారికి వర్తిస్తుందని, పిల్లలు పెద్దలకు సూచించిన మోతాదులో సగం తీసుకోవాలని అన్నారు. అలాగే కరోనా వైరస్‌ నుంచి రక్షణగా ఉండేందుకు, అలాగే రోగనిరోధక శక్తి పెంచాడనికి ప్రతి రోజు ఉదయం యోగ సాధన చేయాలని సూచించారు. అయితే కరోనా నివారణ కోసం ఆయుర్వేదంలో కనుగొన్నది తొలి మెడిసిన్‌ ఇదే కానుంది.Next Story
Share it