ఆ డ‌బ్బుతో ఏం చేయాలో తెలియ‌డం లేదు.. నా గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Dec 2019 2:35 PM GMT
ఆ డ‌బ్బుతో ఏం చేయాలో తెలియ‌డం లేదు.. నా గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం..!

ఇటీవ‌ల జ‌రిగిన‌ 2020 సీజ‌న్ ఐపీఎల్‌ వేలంలో ఆసీస్ పేస్ బౌల‌ర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ను రూ. 15.5 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అత‌ని కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా.. అతని కోసం మాత్రం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కేకేఆర్ అతన్ని ద‌క్కించుకుంది.

అయితే.. ఇంత ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం వ‌ల‌న‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కమ్మిన్స్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే వేలంలో భారీ మొత్తంలో నగదు లభించడంతో కమ్మిన్స్ మాట్లాడుతూ.. అసలు ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియడంలేద‌ని.. నా గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం ఆ డబ్బుతో మా పెంపుడు కుక్కకు కొన్ని బొమ్మలు కొందామని చెప్పిందని అన్నాడు. ఆమెకు మా పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టమ‌ని.. దాంతో మా కుక్కకు ఏమి అవసరమో అవి తీసుకుందామని చెప్పిందని కమ్మిన్స్‌ పేర్కొన్నాడు.

అలాగే.. ఐపీఎల్‌ వంటి పెద్ద లీగ్‌లో ఆడటం ఒక అదృష్టమని.. ఐపీఎల్‌లో నా బెస్ట్ ఫ‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తానని కమ్మిన్స్‌ చెప్పుకొచ్చాడు. అయితే.. నా బౌలింగ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. నేను గేమ్‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను క‌నుకే ఇంకా క్రికెట్‌ను ఆడుతున్నానని క‌మ్మిన్స్ అన్నాడు.

Next Story
Share it