బిస్కెట్ తిన్నారు... కారు బహుమానం పొందారు!!
By సత్య ప్రియ Published on 23 Oct 2019 8:27 AM GMTఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా 'పార్లేజీ కావో, క్రోర్స్ ఇనాం పావో' పేరిట జూన్ నెలలో పార్లేజీ సంస్థ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో వోచర్లను ఉంచి వాటిని దేశ వ్యాప్తంగా పంపిణీ చేసింది.
నగరానికి చెందిన జంగపల్లి నాగరాజుకు రెనాల్డ్ ట్రైబర్ కారు వోచర్ అతని బిస్కెట్ ప్యాకెట్‌లో వచ్చింది. ఈ సందర్బంగా మంగళవారం బేగంపేటలోని రెనాల్డ్ షోరూంలో పార్లేజీ ప్రతినిధులు కారును బహుకరించారు.
పార్లేజీ ప్రాడక్ట్స్ ప్రతినిధి మయాంక్ షా మాట్లాడుతూ తమ బిస్కెట్లను ఎంతగానో ఇష్టపడే వినియోగదారునితో ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. బహుమతిని అందుకున్న జంగపల్లి నాగరాజు మాట్లాడుతూ తన జీవితంలో ఇది అత్యంత గొప్ప రోజు అని ఈ విషయాన్ని తెలుసుకున్న తనకు ఆశ్చర్యం వేసిందన్నారు.
తాను కొన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లో ఇంత పెద్ద బహుమతి ఉంటుందని ఊహించలేదన్నారు. పార్లేజీ యాజమాన్యానికి నాగరాజు కృతఙ్ఞతలు తెలిపారు.