సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పరిమళ్ నత్వాని
By రాణి Published on 10 March 2020 6:07 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ మధ్య టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారమే..టీడీపీకి కూడా రాజీనామా చేసి..జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాగా..ఉన్న నాలుగు రాజ్యసభ సీట్లకు గాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సీటును పరిమళ్ నత్వాని కి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ తరపున రాజ్యసభకు తనను నామినేట్ చేసినందుకు గానూ పరిమళ్ నత్వాని మంగళవారం సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
Also Read : ఎల్లో మీడియా దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలా ? : విజయసాయిరెడ్డి
పరిమళ్ నత్వాని ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం నుంచి రాజ్యసభకు ప్రాతనిధ్యం వహిస్తుండగా..త్వరలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. ఇటీవలే ముఖేష్ అంబాని జగన్ ను కలువగా..వీరి సమావేశం తర్వాతే పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటును కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. కాగా..సోమవారం కూడా పరిమళ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : జగన్ సరికొత్త వ్యూహం.. ‘స్థానికం’ వేళ టీడీపీకి కష్టాలే!