నల్లగొండ జిల్లా: హాలియా పీఎస్ పరిధిలో సింగారపు పరశురామ్ అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పరశురామ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పీఎస్‌లో పరశురామ్ పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.