'ప్యాన్ ఇండియా' చిత్రంగా హీరో ర‌క్షిత్ శెట్టి 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌'

By Newsmeter.Network  Published on  29 Nov 2019 8:56 AM GMT
ప్యాన్ ఇండియా చిత్రంగా హీరో ర‌క్షిత్ శెట్టి అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌'. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు.

హీరో ర‌క్షిత్ శెట్టి ఈ మూవీ గురించి చెబుతూ..

''ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింద‌నే అనుకుంటున్నాను. సాధార‌ణంగా నేను ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాల ట్రైల‌ర్స్‌ను నేనే క‌ట్ చేసుకుంటున్నానన్నారు. కానీ ఈ సినిమా ట్రైల‌ర్‌ను క‌ట్ చేయ‌డానికి నెల‌రోజుల స‌మ‌యం ప‌ట్టిందన్నారు. నేను షార్ట్ ఫిలింస్ నుండి సినిమాల్లోకి వ‌చ్చాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇక 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌' సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా కోసం మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డాను. ఈ జ‌ర్నీలో నాతో పాటు చాలా మంది ప్ర‌యాణించారు. నా టీమ్‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. ఈ సినిమాకు శంక‌ర్ నాగ్‌గ ద‌ర్శ‌క‌త్వం వ‌హించించారు. 'మాల్గుడి డేస్‌' నాకు స్ఫూర్తి. ఆ సినిమాలోని మాల్గుడి ప్ర‌దేశం ద‌క్షిణ భార‌తానికి చెందిన ఉహ‌త్మాక ప్ర‌దేశం. అది భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ఈ సినిమాకోసం మొత్తం19 సెట్స్ వేశాం. దాదాపు 90 శాతం బెంగ‌ళూరు సెట్స్‌లోనే తీశామన్నారు. మిగిలిన భాగాన్ని బీజాపూర్‌, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌రించామని తెలిపారు. అలాగే సినిమా ప్రారంభించి టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యానికి 'ప్యాన్ ఇండియా మూవీ'గా చేయాల‌ని నిర్ణయించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా హ్యూజ్ రేంజ్‌లో విడుదల చేస్తున్నాం అని అన్నారు.

Next Story