పాక్‌ ప్రధానికి షాక్‌..!

By సుభాష్  Published on  22 April 2020 3:54 AM GMT
పాక్‌ ప్రధానికి షాక్‌..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు200 దేశాలకుపైగా చాపకింద నీరులా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పేరు మోసిన దేశాలను సైతం కరోనా వణికిస్తోంది.

Pakistan Pm Imran Khan

ఇప్పటికే దేశ రాణులు, ప్రధానులు, మంత్రులకు సైతం కరోనా సెగ తాకింది. కరోనా వెంటాడటంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా టెన్షన్‌ పట్టుకుంది. ఇటీవల ఆయనను ఓ కరోనా రోగి కలువడంతో వైద్యులు ఆయనను ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

ప్రముఖ స్వచ్చంద సేవా సంస్థ ఈదీ పౌండేషన్‌ వ్యవస్థపకుడు పైసల్‌ ఈదీ ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు 10 మిలియన్ల చెక్‌ను అందించారు. అయితే ఆ తర్వాత చెక్‌ అందించిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆయన కుటుంబ సభ్యులు, పౌండేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిస్తారని, త్వరలోనే క్వారంటైన్‌కు వెళ్తారని పాక్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Next Story