ఈ విషయంలో పాక్ ఆదర్శం.!

By అంజి  Published on  8 Feb 2020 3:11 AM GMT
ఈ విషయంలో పాక్ ఆదర్శం.!

పాకిస్తాన్ పార్లమెంట్ సంచనల నిర్ణయం తీసుకుంది. పిల్లలపై అత్యాచారాలకు, హత్యకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని ఆమోదించింది. ఇలాంటి పనులు చేసేవారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు.

2018లో నౌషెరా ప్రాంతంలో 8ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన పాకిస్తాన్ లో సంచలనం సృష్టించింది. ఇక 2018లో పాక్ లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు పాక్ కు చెందిన ఒక పిల్లల హక్కుల సంస్థ తెలిపింది. దీంతో చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడేవాళ్లకు బహిరంగ ఉరిశిక్ష విధించాంటూ ఆ దేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ తీర్మాణాన్ని ఆమోదించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీయడం సరైనది కాదని, ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లఘించడమే అవుతుందని, దోషులకు విధించే శిక్షల్లో తీవ్రత పెంచినంత మాత్రాన నేరాల సంఖ్య తగ్గదు అని పాకిస్తాస్ పీపుల్స్ పార్టీ నాయకుడు రాజా అష్రాఫ్ అన్నారు. మానవహక్కుల శాఖ మంత్రి శిరీన్ బజారీ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదన్నారు.

Next Story