ఓ అలాగా..తేల్చుకుందాం..!: పాక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 9:44 AM GMT
ఓ అలాగా..తేల్చుకుందాం..!: పాక్

ఇస్లామాబాద్ : భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలపై పాక్ మండిపడింది . మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న జై శంకర్ మాట్లాడుతూ.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్నారు. ఏదో ఒక రోజున పీవోకేను భారత్ భూభాగంలో కలిపేస్తామన్నారు. జై శంకర్ వ్యాఖ్యలపై పాక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తీసుకోవాలని పాక్‌ కోరింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత ఉపఖండంలో ఉద్రిక్తలు పెరిగాయి. 370 ఆర్టికల్ రద్దు తరువాత పాక్ ప్రధాని ఇమ్రాన్ పలుమార్లు అణుయుద్ధం గురించి కూడా మాట్లాడారు. అయితే..కశ్మీర్ తమ అంతర్గత సమస్య అని భారత్ అంటోంది. కశ్మీర్ గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు పాక్‌కు లేదని భారత్ స్పష్టం చేసింది.

Next Story