హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ పరిశోధన బృందం సంచలనం సృష్టించింది. కీలక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు ఇతర భాషల్లోని వీడియోల అనువాదం సబ్‌ టైటిల్స్‌ రూపంలో ఉంటోంది. లేదంటే డబ్బుంగ్‌ చేసుకోవల్సిన పరిస్థితి. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రిపుల్‌ ఐటీలోని ఆర్‌అండ్‌డీడీ సివి. జవహర్‌ నేతృత్వంలోని విద్యార్థుల బృందం, ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ వినయ్‌తో కలిసి ఆటోమేటిక్‌ ఫేస్‌ టు ఫేస్‌ అనువాదంపై కసరత్తు చేసింది. ‘మెషిన్‌ లెర్నిగ్‌ సాయం’తో ‘లిప్‌గాన్‌’ అనే మాడ్యూల్‌ను డెవలప్‌ చేసింది.

ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడినా.. ఈ విధానం ద్వారా భారతీయ భాషల్లో మాట్లాడినట్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. వారు ఏ భాషలో మాట్లాడినా ఇక వీక్షకుల మాతృ భాషల్లోనే మాట్లాడినట్లు కనిపించేలా రూపొందిస్తున్నారు. ఏదైనా వీడియోలో వ్యక్తి మాట్లాడిన భాషను ఆటోమేటిక్‌ స్వీచ్‌ రికగ్నిషన్‌ పసిగట్టి, దానిని న్యూరల్‌ మెషిన్‌ ట్రాన్స్‌ లేషన్‌ మోడల్‌ సాయంతో అవసరమైన భాషలోకి మార్చి, సంభాషణగా మార్చే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ఈ వీడియోలో వ్యక్తులు పలికినట్లుగా పెదాల కదలికలతో సంభాషణ పూర్తిగా సరిపోయేలా ఈ ‘లిప్‌గాన్‌’ మాడ్యూల్‌ పని చేస్తుంది. ఇది మాడ్యూల్‌ అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర భాషల్లో మాట్లాడిన సమయంలో మన భాషలో మాట్లాడే విధంగా మార్పులు చేస్తే.. రెండు కూడా సరిపోలవు. పెదల కదలికలో తేడా ఉంటుంది. దీని ద్వారా వారు ఏ భాషలో మాట్లాడినా మన భాషలోనే మాట్లాడినట్లు ఉంటుంది. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. ఈ లిప్‌గావ్‌ మాడ్యూల్‌ ద్వారా మన భాషలోనే మాట్లాడినట్లు ఉంటుంది. పెదల కదలికలో ఏ మాత్రం తేడా ఉండదు.

Speech To Speech

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగంగా ఉండాలనే దీని అభివృద్ధి: ప్రొ: జవహార్‌

ఈ మాడ్యూల్‌ను అభివృద్ధి చేయడంపై ఫ్రొఫెసర్‌ సివి. జవహార్‌ మాట్లాడారు. ”ఈ వ్యవస్థను రెండు విధాలుగా విభజించాం. స్వీచ్‌ టు స్వీచ్‌ ట్రాన్స్‌ లేషన్‌, లిప్‌ సింథసిస్‌. ఏఎస్‌ఆర్‌, ఎన్‌ఎంటీ, టీటీఎస్‌లను కపలడం ద్వారా మాట్లాడిన భాషను మన భాషలోకి అనువాదం చేస్తాము. భారతీయ భాషల్లో ఉన్న కంటెంట్‌ చాలా తక్కువగా ఉంటోంది. అందులోనూ విద్యకు సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇతర భాషల్లో ఉన్న వీడియోలను మన భాషల్లోకి మార్చగలిగినట్లయితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సాంకేతికను అభివృద్ధి చేస్తున్నాం”.. అని ప్రొఫెసర్‌ జవహర్‌ అన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.