విద్యార్థులే ప్రాణత్యాగం చేశారు..!

By Newsmeter.Network  Published on  17 Dec 2019 11:29 AM GMT
విద్యార్థులే ప్రాణత్యాగం చేశారు..!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జేఎల్ డీఎల్ గ్రూప్ 2 గ్రూప్1 నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పడం నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని JL& DL నోటిఫికేషన్ విడుదలకాక పన్నెండు సంవత్సరాలవుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగాల కోసమే చేశారని. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రకటనలు విడుదలకాక నిరుద్యోగులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు తనపదవి ప్రాణాన్ని పోగొట్టుకొలేదని.. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తమ ఉద్యోగాలు పోగొట్టుకోలేదని కేవలం విద్యార్థులే ప్రాణత్యాగం చేశారన్నారు. ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు లేక నిరుద్యోగులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నారని తెలిపారు .

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణం అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్చల దత్తాత్రేయ* డా.గడ్డం శ్రీనివాస్,చిరంజీవి బెస్త,పసర కొండాకిషోర్,రఘు,వంశీకృష్ణ,కొండూరు నవీన్,వెంకన్న,పాండునాయక్, ప్రేమ్ కుమార్ రవీందర్ నాయక్,మహేష్ యాదవ్, సురేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it