ఉస్మానియా ప్రొఫెసర్ డా.జగన్ ఇంట్లో ఎస్‌ఐబీ సోదాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 2:51 PM GMT
ఉస్మానియా ప్రొఫెసర్ డా.జగన్ ఇంట్లో ఎస్‌ఐబీ సోదాలు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డాక్టర్ జగన్ ఇంట్లో ఎస్‌ఐబీ పోలీసులు సోదాలు చేశారు. కొంత కాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఎస్‌ఐబీ పోలీసులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ జగన్ ఇంట్లో మావోయిస్ట్‌ల లేఖలు, ల్యాప్‌ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ జగన్‌పై మహబూబ్‌నగర్‌లో కేసు నమోదైంది. డాక్టర్‌ జగన్‌ను ఎస్‌ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డా.జగన్ అరెస్ట్ ను ఖండించిన తెలంగాణ పౌర హక్కుల సంఘం

విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ అక్రమ అరెస్ట్ ను పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండించింది.

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని తార్నాకలో విరసం కార్యవర్గ సభ్యుడు డా.కె.జగన్ ఇంటిలో పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే..ఈ అరెస్ట్ ను అక్రమ అరెస్ట్ అని పౌర హక్కుల సంఘం నేతలు అంటున్నారు. డా.జగన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్లుగా సుదీర్ఘంగా పోరాడారు. విరసం కార్యవర్గంలో ఆరేళ్ళుగా కొనసాగుతున్నారు. స్టూడెంట్ మార్చ్ పత్రికలో సంపాదకులుగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా పోలీసులు గద్వాలలో అక్రమంగా TVV నాయకుడిని ఇదే విధంగా అరెస్ట్ చేశారని పౌర హక్కుల సంఘం నేతలు చెప్పారు. అరెస్ట్ చేసిన డా.జగన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం నేతలు.

Next Story