తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసులు వాయిదా

By సుభాష్  Published on  17 Aug 2020 2:28 AM GMT
తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసులు వాయిదా

తెలంగాణలో ఈ రోజు నుంచి దూరదర్శన్‌, టీ-శాట్‌ ఛానళ్లలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్‌ డిజిటల్‌ తరగతుల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.త్వరలో ఈ డిజిటల్‌ తరగతులు ప్రారంభించే తేదీలను ప్రకటిస్తామన్నారు.

కాగా, ఆగస్టు 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసులు, అలాగే ఈనెల 20వ తేదీ నుంచి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు, సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సర్కార్‌ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వర్షాల కారణంగా తరగతులను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story