కొనసాగుతున్న బోట్‌ వెలికితీత పనులు..

తూర్పు గోదావరి జిల్లా: కచ్చులూరు వద్ద బోట్ వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.
కాకినాడ మెరైన్ కెప్టెన్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ధర్మాడి సత్యం బృందం వెలికితీత పనులు చేపట్టారు. బోటు వెలికితీత పనులు సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతాయి. అయితే ఘటన స్థలి వద్ద ఆకాశం మేఘావృతం కావడంతో పనులు కొనసాగుతాయా లేదా అన్నదానిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ..వారం కిందట కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. తీరా గోదావరి ఉదృతి పెరగడంతో బోటు వెలికితీత పనులకు నిపుణులు స్వస్తి పలికారు.

ఇప్పుడు పై నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో..బోటును బయటకు తీసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.