అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన విజయవాడకు రానున్నారు. అయితే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరా రెడ్డి ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కాగా..తాను పార్టీ వ్యవహారాలను చూడలేననీ, తన స్థానంలో మరొక సమర్ధుడైన నాయకుడిని నియమించాలనీ ఆయన అధిష్ఠానాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఊమెన్‌ చాందీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ చింతా మోహన్‌, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఎవరికి ఆ స్థానం దక్కుతుందనేది తెలియాలీ… కానీ..ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు దూరమైన సంగతి తెలిసిందే.. ఈ పరిస్థితులలో ప్రజలతో మమేకమయ్యే నేతను పీసీసీ చీఫ్‌గా నియమించాలని కార్యకర్తలు భావిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.