కరోనాకి, వయసుకీ సంబంధం లేదు గురూ..

By సుభాష్  Published on  26 March 2020 6:55 AM GMT
కరోనాకి, వయసుకీ సంబంధం లేదు గురూ..

అబ్బే.. కరోనా నన్ను ఏం చేస్తుంది నాది స్ట్రాంగ్ బాడీ.. నాకు చిన్నప్పటి నుండి తలనొప్పి కూడా రాలేదు. ఏ కరోనా అయినా నన్ను చూసి పరిగెట్టి పారిపోవలసిందే. ఊరకో మామ. మనమేమన్నా ముసలోళ్లమా ఏంది మూలన గూసోనికి.. యూత్ ఇక్కడ..

ఈ విషయం చదివిన తర్వాత చెప్పండి డైలాగులన్నీ..

కరోనా వైరస్ కారణంగా ఎక్కువ మంది వృద్ధులే చనిపోతున్నారని.. లేదా ఇతర అనారోగ్యాలు ఉన్నవారే దీని బారిన పడుతున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే.. ఈ వైరస్ ఎలాంటివారికైనా సోకే అవకాశం ఉందని తాజాగా నిర్ధారణ అయ్యింది.

కరోనా వైరస్ బారిన పడి 21 ఏళ్ల యువతి మరణించింది. అవును మీరు చదివింది కరెక్టే ఆ అమ్మాయి వయస్సు 21. అంతేకాదు ఆమెకు అంతకు ముందు ఎటువంటి అనారోగ్యం లేదు. ఇలా అనారోగ్యం లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని గుర్తించారు. యుకెలోని బకింగ్‌హామ్‌షైర్‌లో నివసిస్తున్న చలోయి మిడిల్టన్ తల్లి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయ్యింది.

దేశవ్యాప్తంగా ప్రజలు చలోయికి నివాళులు అర్పించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఇప్పుడిది ట్రెండింగ్ లో ఉంది. ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదని చలోయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాణాంతక వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, ప్రజలంతా ఇంట్లోనే వుండాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా, కరోనా వైరస్ సోకిన వారి కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్ టు డు.. వాట్ నాట్ టు డు.



Next Story