మంగళవారం నాడు మళ్లీ ఇంధనం ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 15 పైసలు చొప్పున పెరిగింది. దీంతో.. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.78.80, డీజిల్ ధర రూ.73.11 కు చేరింది. దేశంలోని మిగతా నగరాల్లో కూడా సుమారుగా ఇదే ధర నడుస్తోంది.

గత 8 రోజుల నుంచీ ప్రతి రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2, డిజీల్ ధర లీటరుకు రూ.1.63 చొప్పున పెరిగింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.