భార్యను చంపి.. 300ముక్కలుగా చేసిన డాక్టర్‌..

By Newsmeter.Network  Published on  27 Feb 2020 10:08 AM GMT
భార్యను చంపి.. 300ముక్కలుగా చేసిన డాక్టర్‌..

అతనో రిటైర్డ్ ఆర్మీ డాక్టర్‌. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఈ ఘటన 2013లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. తాజాగా అతనికి న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది.

భువనేశ్వర్‌కు చెందిన సోమనాథ్ పరీదా ఆర్మీలో డాక్టర్‌‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. 2013, జూన్ 3న భార్యతో గొడవ జరిగింది. ఆ ఆవేశంలో ఆమెను హత్య చేశాడు. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు ఆమెను 300 ముక్కలుగా చేసి రెండు స్టీల్‌ డబ్బాల్లో దాచాడు. అయితే.. బంధువులతో సఖ్యతగా ఉండని కారణంగా వీరింటికి బంధువుల రాకపోకలు లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదు. కాగా వీరి కుమారై భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుంది. ఆమె పదే పదే తల్లికి ఫోన్‌ చేస్తుండగా.. ఎప్పుడు తండ్రే..మాట్లాడేవాడు. తల్లి ఒక్కసారి కూడా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చింది. అమ్మ ఎందుకు ఫోన్‌ మాట్లాడటం లేదని.. నిలదీయడంతో.. తనకు ఏమీ తెలిదనీ.. తనను ఏమీ అడగవద్దని ఫోన్‌ పెట్టేశాడు. దీంతో అనుమానం వచ్చిన కూతురు.. తమ సమీప బంధువుకు ఫోన్‌ చేసి విషమం చెప్పింది. ఇంటికి వెళ్లి చూడాలని చెప్పింది. ఆ బంధువు ఇంటికి వెళ్లి చూడగా.. సోమనాథ్ ఒక్కడే కనిపించాడు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ డాక్టర్‌ ఇంటికి చేరుకుని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. రెండు స్టీల్ డబ్బాల్లో ముక్కలు ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని చూసి షాకయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఓ కత్తి, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

భార్యను తాను చంపలేదంటూ సోమనాథ్ కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసును సుమారు ఆరేళ్లుగా విచారిస్తున్న ఖుర్దా జిల్లా సెషన్స్ కోర్టు సోమనాథ్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు లేనప్పటికీ సంఘటనా స్థలంలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి లోక్‌నాథ్ మహోపాత్ర ఆర్మీ డాక్టరే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

Next Story
Share it