నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య కలకలం రేపింది.
నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాలగిరి రావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్యనగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఎన్నికలు తరువాత బదిలీ చేయకపోవడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సందర్శించారు.