ఓ ప్రధాని బహుశా ఆడవాళ్ల గురించి.. ఇలా మాట్లాడి ఉండడు..

By Newsmeter.Network  Published on  28 Jan 2020 3:41 PM GMT
ఓ ప్రధాని బహుశా ఆడవాళ్ల గురించి.. ఇలా మాట్లాడి ఉండడు..

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆస్పత్రిలో ప్రసంగిస్తూ.. నోరు జారారు. దీంతో నెటిజన్లు ఇమ్రాన్‌ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

2013 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ స్టేజ్‌పై నుండి ప్రసంగిస్తుండగా స్టేజ్ కూలిపోయినప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ కు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హుటాహుటిన అతన్ని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ డాక్టరు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారో కానీ ఆ మెడిసిన్ శరీరంలోకి దిగగానే నా చుట్టూ ఉన్న నర్సులు దేవకన్యల్లా కనిపించారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అసలు ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నాడంటే.. '2013 ఎన్నికల ప్రచారంలో నేను వేదికపై నుండి పడిపోయిన తరువాత నేను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు, నేను గాయాల కారణంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నాను. కానీ డాక్టర్ అసిమ్ నాకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, నా బాధలన్నీ పోయాయి. ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు” అని ఇమ్రాన్ తెలిపారు. తరువాత ఆసుపత్రి ఆవరణలో నేనో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే అప్పుడు ఏమన్నానో నాకు పెద్దగా గుర్తులేదు’ అని అన్నారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇమ్రాన్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. ‘నీ స్థాయికి ఇటువంటి వ్యాఖ్యలు సబబేనా'.. నువ్వు ఓ దేశానికి ప్రధాని వి ఇలాంటివి నీకు తగునా అంటూ తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు.



Next Story
Share it