సమ్మర్‌లో పోటీ పడనున్న ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌..!

By సుభాష్  Published on  7 April 2020 12:47 PM GMT
సమ్మర్‌లో పోటీ పడనున్న ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌..!

ఈ ఏడాది టాప్‌ హీరోల మధ్య పోరు కొనసాగింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురంలో, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో సంక్రాంతి పండగ బరిలో దిగారు. ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావడంతో వీరి మధ్య ఎన్నడూ లేని పోటీ జరిగిందనే చెప్పాలి. ఇక స్టార్‌ హీరోల మధ్య సాగిన పోరు.. వచ్చే సంవత్సరం కూడా అల్లు అర్జున్‌, జూ. ఎన్టీఆర్‌ మధ్య జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను చేస్తూనే మరో సినిమాను కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను 2021లో సమ్మర్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక 'అల వైకుంఠపురములో సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న అల్లు అర్జున్‌ తదుపరి సినిమాను సుకుమార్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా 2021 వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. కాగా, ముందుగా 2020 చివర్లో విడుదల చేయాలని సుకుమార్‌ భావించినా.. కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడిపోవడం తో వచ్చే ఏడాది సమ్మర్‌కు మార్చారు.

అయితే నిదానంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేయాలని ఆలోచిస్తోందట. ఇదే జరిగితే 2021 సమ్మర్‌లో బాక్సాఫీస్‌ వద్ద ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల పోటీ ఖాయమని తెలుస్తోంది.

Next Story
Share it