ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు

By రాణి  Published on  13 April 2020 6:23 AM GMT
ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు

ముఖ్యాంశాలు

  • న్యూ జెర్సీలో ఫిర్యాదు చేసిన శ్రవంత్
  • అమెరికాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా ?
  • భారత్ ను పొగుడుతూ, అమెరికాలో వైఫల్యాలకు కారణాలు చెప్పిన స్వాతి
  • ఇండో అమెరికన్లకు సారీ చెప్పిన స్వాతి

అమెరికాలో కరోనా విజృంభించడానికి కారణాలు..భారత్ లో కరోనా ప్రబలకుండా తీసుకున్న చర్యలు, అక్కడి లైఫ్ స్టైల్, ఇక్కడి జీవిత విధానం గురించి వివరిస్తూ నాలుగురోజుల క్రితం స్వాతి దేవినేని అనే ఎన్ఆర్ఐ యువతి ఓ వీడియో రూపొందించింది. అది నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన భారతీయులు భేష్ అని మెచ్చుకున్నారు కూడా. కానీ ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి మాత్రం స్వాతి చేసింది తప్పని పేర్కొంటూ ఆమెపై న్యూజెర్సీలోని పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఆ విషయాన్ని అతనే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించాడు.

విషయానికొస్తే..భారత్ ను పొగుడుతూ, అమెరికాపై విద్వేషాన్ని పెంచేలా స్వాతి వ్యాఖ్యలు చేసిందని వాపోయాడు శ్రవంత్ పోరెడ్డి అనే ఎన్ఆర్ఐ యువకుడు. అసలు స్వాతి దేశ విద్వేషాన్ని రెచ్చగొట్టేంతలా ఏం మాట్లాడింది.. అనుకుంటున్నారా ? ఇదిగో ఈ వీడియో చూడండి.

[video width="220" height="400" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/NRI-Woman-Swathi.mp4"][/video]

Also Read : అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు

ఇప్పుడు స్వాతి అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడి విద్వేషాన్ని రెచ్చగొట్టిందంటూ శ్రవంత్ పోరెడ్డి వాపోయారు. అమెరికాలో 20 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి నిజమే..కానీ దాని ఆధారంగా అమెరికా ప్రజలను కాపాడటంలో విఫలమైందని వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటున్నారు శ్రవంత్. అందుకే ఆమెపై న్యూ జెర్సీలోని సౌత్ ప్లేన్ ఫీల్డ్ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కోర్టులన్నీ మూతపడటంతో..తిరిగి పరిస్థితి మామూలైనప్పుడే ఈ కేసు కోర్టులో విచారణకు వస్తుందన్నారు. అప్పుడు కోర్టు ఆమెపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూద్దాం అంటూ ఫేస్ బుక్ లో శ్రవంత్ వీడియో పోస్ట్ చేశారు.

https://m.facebook.com/story.php?story_fbid=10163551267285405&id=840350404

శ్రవంత్ ఫిర్యాదు అనంతరం స్వాతి తాను అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సారీ చెప్పారు. నిజానికి అది తన మనోభావం కాదని, అమెరికాలో కరోనా విజృంభణకు కారణాలు ప్రపంచానికి తెలియజెప్పేలా ఓ యూట్యూబ్ ఛానెల్ పంపిన స్క్రిప్ట్ ను తాను చదివానని చెప్పుకొచ్చారు. భారతీయులు ఆర్థికంగా ఎదగడానికి అమెరికా ఎంత సహాయపడిందో తనకు తెలియని విషయం కాదన్నారు. కానీ యూ ట్యూబ్ ఛానెల్ పంపిన స్క్రిప్ట్ ను చదువుతున్న క్రమంలో ఆ వీడియో పై ఛానెల్ లోగో లేకుండా అనుకోకుండా వైరల్ అయిందని పేర్కొన్నారు. అమెరికా అంటే తనకు కూడా గౌరవం ఉందని, తాను నివసిస్తున్న దేశాన్నే తిట్టేంత అసమర్థురాలిని కాదన్నారు. తన వీడియో చూసి హర్ట్ అయిన వారందరికీ సారీ చెప్పారు దేవినేని స్వాతి.

అయితే ఇది కేవలం వీరిద్దరి మధ్యనున్న బేధాభిప్రాయమా ? లేక అంతర్జాతీయ శక్తుల పోరాటమా అన్న ప్రశ్న తలెతత్తుతోంది. కొసమెరుపేమిటంటే స్వామి దేవినేని పై కేసు పెట్టిన వ్యక్తి కూడా తెలుగు వాడే కావడం. సాటి తెలుగువాడయ్యుండి మనదేశాన్ని పొడిగిన అమ్మాయిపై ఇలా కేసులు పెట్టడం ఎంత వరకూ సరైన నిర్ణయమని కొందరు ప్రశ్నిస్తుంటే..మరికొందరు శ్రవంత్ చేసింది కరెక్టేనంటున్నారు.

Next Story