ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు

By సుభాష్  Published on  7 Oct 2020 8:32 AM GMT
ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు

ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కును పేల్చివేయడంతో 19 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అలెప్పొ ప్రావిన్స్‌లో ఉన్న అల్‌ బాబ్‌ జిల్లా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి వెనుక ఐపీజీ గానీ, పీకేకే ఉగ్రవాద సంస్థ గానీ ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అల్‌బాబ్‌ పట్టణంలో దాడి జరగడం వారంలో ఇది రెండోసారి.

ఆదివారం అక్కడి చెక్‌ పాయింట్‌ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ చెర నుంచి 2017లో అల్‌ బాబ్‌ పట్టణానికి సిరియా ఆర్మీ విముక్తి కలిగించింది. టర్కీ బోర్డర్‌ సమీపంలో ఉన్న ఈ పట్టణంల నుంచి ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ 2016లో ఏడు నెలల పాటు ఆపరేష్‌ చేపట్టింది. అయితే ఈ పేలుడుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టర్కీ దక్షిణ సరిహద్దకు సమీపంలో ఉన్న నగరంలో ఉగ్రవాదుల గ్రూప్‌ ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Next Story