కోవిడ్-19 అనుమానం.. చంపేసిన ఉత్తరకొరియా
By Newsmeter.Network Published on 13 Feb 2020 1:29 PM GMTఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఎంత పెద్ద నియంతో అందరికి తెలిసిందే. ఉత్తరకొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంగిస్తే.. శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. ప్రపంచాన్ని ప్రస్తుతం కోవిడ్-19(కరోనా వైరస్ కొత్తపేరు) వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 1335 మందికి పైగా చనిపోయారు. దీని పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి.
తమ దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కిమ్‌జోంగ్ కఠిన విధానాలను అమలు చేస్తున్నాడు. చైనా నుంచి వచ్చిన వారిని, చైనీస్ ప్రజలను కలిసివారిని నిర్బంధించమని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. చైనాతో సరిహద్దులను కూడా మూసేశారు. ఓ వాణిజ్య అధికారి ఇటీవల చైనా నుంచి వచ్చాడు. అతడు నిబంధనలను ఉల్లంఘించడంతో కాల్చి చంపారు.
దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తపత్రిక తన కథనంలో వెల్లడించిన వివరాల మేరకు.. ఓ వాణిజ్య అధికారి ఇటీవల చైనా నుంచి ఉత్తరకొరియాలోని సియోల్ నగరానికి వచ్చాడు. వైరస్ భయంతో ఉత్తరకొరియా అధికారులు అతన్ని పర్యవేక్షణ పేరుతో నిర్భందించారు. కాగా అతడు.. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించి.. ఓ పబ్లిక్ బాత్రూమ్ దగ్గర కనిపించడంతో.. అక్కడిక్కడే కాల్చి చంపినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. వైరస్ ఇతరులకు వ్యాపించేలా ప్రమాదకరంగా ప్రవర్తించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనం యొక్క సారాంశం.