విషాదంలో మెగా హీరోలు..అనారోగ్యంతో నూర్‌భాయ్‌ మృతి

By Newsmeter.Network  Published on  8 Dec 2019 6:09 PM IST
విషాదంలో మెగా హీరోలు..అనారోగ్యంతో నూర్‌భాయ్‌ మృతి

మెగా హీరోలు విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్‌ మెగా అభిమానులకు సుపరిచితుడైన వ్యక్తి నూర్‌ మహ్మద్‌ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఫ్యామిలీ అభిమానిగా ఉన్న నూర్‌ భాయ్‌.. పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఇలా ఎందరితోనో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మెగా కుటుంబానికి మద్ధతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నూర్‌ భాయ్‌ ఆదివారం మృతి చెందారు.

నూర్‌భాయ్‌ మృతి పట్ల మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో మెగా హీరోలకు మద్ధతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం, మెగా అభిమానుల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించటం లాంటి అంశాల్లో నూర్‌ భాయ్‌ ఎప్పుడూ ముందుండేవాడు. అందుకే మెగా హీరోలు ఆయన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు.

Noor Bhai passes away

విషాదంలో మెగా ఫ్యామిలీ...అభిమానులు

నూర్‌భాయ్‌ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన మరణించడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనమృతితో ఈ రోజు జరగాల్సి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అలవైకుంఠపురములో టీజర్‌కు సంబంధిచిన అప్‌డేట్‌ ఈ రోజు ఇస్తున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు. అయితే నూర్‌ భాయ్‌ మృతి సందర్భంగా ఆ ప్రకటనను వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ధృవ సినిమా రిలీజ్‌ అయి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు ప్లాన్‌ చేసిన సెలబ్రేషన్స్‌ను కూడా క్యాన్సిల్‌ చేసినట్టుగా మెగా అభిమానులు ప్రకటించారు.

Noor Bhai





Next Story