నోకియా వినియోగ‌దారుల‌కు హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. నోకియా స్మార్ట్‌ఫోన్లపై ధరలను భారీగా తగ్గిస్తున్న‌ట్లు కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ముఖ్యంగా నోకియాలోని రెండు మోడల్స్‌కు సంబంధించి స్మార్ట్‌ఫోన్లపై రూ. 3500 ధ‌ర వరకూ తగ్గించారు. ఈ ఆఫ‌ర్‌ను క‌స్ట‌మ‌ర్లు గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా కంపెనీ పేర్కొంది.

త‌గ్గిన ధ‌ర‌ల ప్ర‌కారం.. నోకియా 6.2 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రూ. 15,999 ఉండగా.. రూ. 3,500 తగ్గించగా ప్రస్తుతం రూ. 12,499కే ల‌భించ‌నుంది. నోకియా 7.2 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రూ. 18,599 ఉండగా.. రూ. 3,100 త‌గ్గించ‌గా.. ప్రస్తుతం రూ. 15,499ల‌కు లభించనుంది. త‌గ్గిన ధ‌ర‌ల‌తో నోకియా స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్, నోకియా ఇండియా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.