ఏపీపీఎస్సీలో ఇక ఇంటర్వ్యూలు ఉండవు - సీఎం వైఎస్ జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2019 4:13 PM ISTఅమరావతి: ఏపీపీఎస్సీపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఓ చారిత్రక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి, 2020 నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలన్నారు. అత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి జనవరిలో కూడా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు. అయితే...ఏపీపీఎస్సీ విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్న సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.