నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్‌ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 7:34 AM GMT
నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్‌ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష

నిజామాబాద్ జిల్లా: పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరు అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు.

నిజామాబాద్ జిల్లా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఎర్రమంజిల్ ఆర్‌ అండ్ బి ఆఫీస్‌లో సంబంధిత ఇరిగేషన్ అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఆర్మూర్ నియోజకవర్గంలోని కంఠం, చిక్లీ ,మచ్చర్ల సుర్భిర్యాల్, ఫత్తేపూర్ లలో నీటి పారుదల ఎంత వరకు వచ్చిందో సమీక్షించారు. బాల్కొండ నియోజకవర్గంలోని చిట్టాపూర్ , శ్రీరాంపూర్ గ్రామాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు లిఫ్టులు ఏర్పాటును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుత్ప ఆయకట్టు ... అలాగే లిఫ్ట్‌ల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు వంద శాతం నీరు అందించాలన్నారు. దీని కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

చౌట్పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్టు పథకంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిచేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని గ్రామాలకు సాగునీరు అందివ్వాలని అధికారులకు అల్టీమేటం ఇచ్చారు.

నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలోని ప్యాకేజ్ 21 పైప్ లైన్ పనులు

త్వరితగతిన పూర్తి కావాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి సహకారంతో రైతులను ఒప్పించాలన్నారు. త్వరిగతిన పైప్‌ లైన్‌లు వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి.

జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి నాగమడుగు లిఫ్ట్ పథకం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. కాబట్టి చెక్ డ్యామ్ లొకేషన్,అప్రోచ్ కెనాల్ పొడవు ,పంప్ హౌస్ లొకేషన్ త్వరితగతిన నిర్ణయించాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అలాగే.. ప్రాజెక్ట్ లో ఎంత వీలైతే అంత తక్కువ భూ సేకరణ అవసరం అయ్యేటట్లు డిజైన్ చేయాలని సూచించారు.

ఈ అన్ని అంశాలలో స్థానిక శాసన సభ్యులు జీవన్ రెడ్డి,బాజిరెడ్డి గోవర్ధన్,హన్మంత్ షిండే

సలహాలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Next Story