ప్రాణం తీసిన టిక్ టాక్ పిచ్చి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 8:30 AM GMT
ప్రాణం తీసిన టిక్ టాక్ పిచ్చి..!

నిజామాబాద్ : టిక్ టాక్ మోజు మరొకరి ప్రాణాల మీదికి తెచ్చింది. టిక్ టాక్ చేస్తూ ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నా.. ఆ మహమ్మారిని మాత్రం వదలట్లేదు యువత. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు మిత్రులతో టిక్ టాక్ చేయడానికి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. దినేష్ అనే యువకుడు టిక్ టాక్ వీడియో చేయడానికి చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాడు. నీటి ప్రవాహం ఎక్కువైనా పట్టించుకోని దినేష్.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రెండురోజులుగా దినేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. భీమ్ గల్ మండలం గోనుగొప్పుల శివారులోని కప్పల వాగు చెక్ డ్యామ్ వద్ద దినేష్ మృతదేహం దొరికింది. చేతికందిన కొడుకు మృతి చెందటంతో దినేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Next Story
Share it