నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాంప్‌ రాజకీయాలు చేస్తోందని తెలిసింది. హైదరాబాద్‌ శివారులోని ఓ రిస్టార్ట్స్‌కు జెడ్పీటీసీలు, ఎంపీటీసులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించి క్యాంప్‌ రాజకీయాలు చేస్తోందని మీడియా ప్రతినిధులు తెలిపారు. ఒక వైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా కట్టడి చేస్తుంటే.. రిసార్ట్‌లో ఐదు వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు మద్యం సేవిస్తూ హల్‌ చల్‌ చేశారు.

Also Read: కేసీఆర్‌ ఇంటి నుంచి మరో మంత్రి రానున్నారా..?

ప్రస్తుతం రిసార్ట్‌లో స్థానిక నాయకులు ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాంప్‌ దృశ్యాలను ఓ స్థానిక నాయకుడు వాట్సాప్‌లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక నిజామాబాద్‌లో స్థానిక సంస్థల పదవుల్లో 80 శాతం మంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఉన్నారు. పదవి చేజారకుండా ఉండేందుకే ఈ క్యాంప్‌ రాజకీయాలు మొదలు పెట్టారని సమాచారం. క్యాంప్‌లో దాదాపు 500 మంది నాయకులు మందు, మాంసంతో ఎంజాయ్‌ చేశారు.

Also Read: దేశవ్యాప్తంగా 294..తెలంగాణలో 21 కరోనా కేసులు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే అక్కడ ఆమె గెలుపు దాదాపుగా ఖరారు అయ్యిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పుకుంటన్నాయి. అయితే బలం ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం తలెత్తుతోందని తెలుస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జరిగినట్లు ఫలితాలు మళ్లీ రిపీట్‌ అవుతాయేమోననే సందేహం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు తాజాగా రిసార్ట్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.