నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగంతకులు యువతిని అపహరించారు. సల్పబండ తండాకు చెందిన బానవత్ లత(10)ను అపహరించారని స్థానికులు చెబుతున్నారు. దుబ్బాక రోడ్డు సమీపంలో గేదెలు కాయడానికి వెళ్లిన యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యువతి బంధవులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.