ఇక బొంది తోనే కైలాసం..!

By అంజి  Published on  4 Dec 2019 5:06 AM GMT
ఇక బొంది తోనే కైలాసం..!

పురాణాలలో త్రిశంకుడు అనేవాడు ఒకడు బొందితోనే స్వర్గానికి పోదాం అనుకున్నాడట. అతని కోసం విశ్వామిత్ర మహర్షి తన తపస్సంతా ధారపోసి కైలాసాన్ని సృష్టిస్తామని ప్రయత్నించడట. అంతటి రాజర్షే స్వర్గాన్ని సృష్టించడం నావల్ల కాదు మహాప్రభో అని చేతులెత్తేశాడట. ఇప్పుడు మన నిత్యానంద అనే స్వయం ప్రకటిత దేవుడు, రేప్ కేసు నిందితుడు, ఇండియా నుంచి పారిపోయిన ఓ ట్రిపుల్ ఎక్స్ స్వామి ఒక దీవిని కొనుగోలు చేశారట. ఆ దీవిని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరుకుంటున్న నిత్యానంద ఒక పాస్‌పోర్టు, జెండా, జాతీయ చిహ్నాన్ని కూడా తయారు చేసుకున్నాడు. అంతటితో అక్కడ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, క్యాబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పడేసాడు. వీరు తమ అవకాశాన్ని బట్టి రోజు మంత్రివర్గ సమావేశాలు కూడా జరుపుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా కైలాస.. దీనికి ఒక అధికారిక వెబ్ సైట్‌ని కూడా రూపొందించారండోయ్.

Nithyananda Kailaasa 750

'కైలాస.. రివైవింగ్‌ ద ఎన్‌లైటెన్డ్‌ సివిలైజేషన్‌.. ద గ్రేట్‌ హిందూ నేషన్‌’ పేరుతో నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ దేశం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు సమీపంలో ఉంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనేసుకున్న నిత్యానంద ఆ దేశానికి ఆయనే రాజుగా ప్రకటించేసుకున్నాడు. అయినా తానే దేవుడినని ప్రకటించుకున్న వాడికి రాజుగా చెప్పుకోవడం పెద్ద విషయమా. ఇంతకీ ఈ కైలాస వాసులు కావాలనుకునేవారికి చెయ్యాల్సినది ఏంటో తెలుసా.. ఎస్.. మీరు ఊహించిందే.. భారీగా విరాళాలివ్వడమే. పైసలిస్తే పౌరసత్వం అన్నమాట. అలా అని పాస్‌పోర్టు, పౌరసత్వం లేకపోయినంత మాత్రాన మీరేం ఫీలైపోవక్కరలేదు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా హిందూయిజాన్ని ఆచరించలేకపోతున్న హిందువులైతే చాలు. ఆ దేశ పౌరులే.. ఇది బహిరంగంగా చెబుతున్న విషయాలు.

Kailaasa Flag

కానీ మనలో మన మాట. నిత్యానంద దేశమంటే హద్దులే లేని దేశమే అయ్యుంటుంది కదూ. ఇక ఆ లోగో కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. మెరున్ కలర్ లో కనిపిస్తున్న సింహాసనంపై నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది బొమ్మతో జెండాను రూపొందించారు. ఇక పాస్వర్డ్తో రెండు రంగులో ఉంటుంది ఒకటి బంగారం రంగు, ఇంకొకటి ఎరుపు రంగు. అంటే విరాళాన్ని బట్టి రంగులు ఉంటాయేమో. ఇక ఈ దేశానికి రాజ్యాంగము, ఒక 10 విభాగాలు ఉండనే ఉన్నాయి. ఇంతకీ నిత్యానంద ఈ సొంత దేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా.. పాపం తను ఇండియాలో హిందుత్వాన్ని ప్రచారం చేస్తుంటే తన ప్రాణానికి రక్షణ లేకుండా పోయిందట. తనలాంటి వారికోసమే ఈ దేశాన్ని ఏర్పాటు చేస్తారట. నిత్యానంద స్వామి చెప్పుకుంటున్న కైలాస దేశాలలో మేమూ సభ్యులమే అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నారని ఆ వెబ్సైట్ చెబుతోంది. ప్రస్తుతానికి మన దేశం నుంచి పారిపోయిన నిత్యానంద ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట.

Kailaasa Passports Kailaasa University

Next Story