ఇంట్రెస్టింగ్‌గా ‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్ లుక్

By సుభాష్  Published on  19 Oct 2020 7:11 AM GMT
ఇంట్రెస్టింగ్‌గా ‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్ లుక్

అశోక్‌ సెల్వన్‌, నిత్యా మీనన్, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. తమిళ్ హీరో అశోక్ సెల్వన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాపీనీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడి ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఐ.వి శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిత్య, రీతు, అశోక్ సెల్వన్ తలలు ప్లేట్‌లో ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. నిత్య స్వీట్ టేస్ట్ చేస్తూ స్మైల్ ఇస్తుంటే, అశోక్ సెల్వన్ ముందు నూడిల్స్‌ పెట్టుకుని ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఉన్నాడు. ఇక రీతు ముందు వెజిటబుల్స్, పనీర్ ఉండగా ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ‘కుకింగ్ సూన్’ అంటూ త్వరలో సినిమా విడుదల గురించి ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ''ఒక మోస్తరు బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి కొంతకాలం అయ్యింది. అవుట్ పుట్ తో మా టీమ్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం ఒక అర్బన్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇది ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది'' అని చెప్పారు.

Next Story