'మహాసముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్

By సుభాష్  Published on  19 Oct 2020 7:03 AM GMT
మహాసముద్రంలో అను ఇమ్మాన్యుయేల్

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఈ చిత్రం తరువాత కొంత కాలం గ్యాప్‌ తీసుకున్న అజయ్‌ ప్రస్తుతం తన రెండో చిత్రానికి 'మహా సముద్రం' అనే పేరు పెట్టాడు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో శర్వానంద్‌, సిద్దార్ద్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లకుండానే రెగ్యులర్‌గా అప్డేట్స్‌ ఇస్తూ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది చిత్ర బృందం.

ఇక ఈ చిత్రంలో శర్వా సరసన క్యూట్ భామ సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ లో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటించనుందని ప్రకటించారు .ఇప్పటికే ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మహాసముద్రం' స్క్రిప్ట్ లో అందరికి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను క్రియేట్ చేసిన అజయ్ భూపతి.. అను ఇమ్మాన్యుయేల్ కి కూడా ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చారని తెలుస్తోంది. వైజాగ్ బ్యాగ్రౌండ్ లో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారని సమాచారం.

Next Story