నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 10:25 AM GMT
నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణ

హైదరాబాద్: తీవ్ర దుమారం రేపిన నిలోఫర్‌ ఆసుపత్రిలోని క్లినికల్‌ ట్రయల్స్‌పై విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. నిలోఫర్ బోర్డ్ రూంలో విచారణ జరుగుతుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు పలువురి సీనియర్లను కూడా అధికారులు విచారించారు. రవి కుమార్‌, డాక్టర్ రాజారావు, లక్ష్మీ కామేశ్వరి, విమల థామస్‌లను కమిటీ విచారించింది.

300 మంది పిల్లలపై ప్రయోగాలు

నిలోఫర్‌లో వందలాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ బాధితులుగా మిగిలారనే వార్తలు దుమారం రేపాయి.ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌పేషెంట్లుగా వచ్చిన శిశువుల దగ్గర నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో స్పష్టం చేసింది. 300 మంది పిల్లల్లో 100 మందిని జనరల్ వార్డ్ నుంచి..మరో 100 మందిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి.. ఇంకో వంద మందిపి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి సెలెక్ట్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

13 సార్లు క్లినికల్ ట్రయల్స్

పిల్లలు రోగాలతో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించారు. తరువాత వారిపై అదెలా పని చేస్తుందో రికార్డ్ ల్లో రాశారు. ఇతర మందులతో బెటరా..కదా అనే విషయంపై ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా నిలోఫర్‌ క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు తెలుస్తోంది. 13 ట్రయల్స్ జరిగినట్లు విచారణలో బయటపడింది. విచారణ తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

Next Story