మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా రావడం అంటే మాములు విషయం కాదు. అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసినా.. ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ రాలేదని చెప్పాలి. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా అభినయంతో ఆకట్టుంది. అయినా ఎందుకనో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం లేదు. ఇక పేరున్న ఫ్యామిలీ నుంచి రావడంతో గ్లామరస్‌ పాత్రలను ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సాహించడం లేదు. దీంతో నిహారికకు కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలే తప్ప గ్లామర్ డాల్ లాంటి పాత్రలు రావడం లేదు.

తనకు అలాంటి పట్టింపులు ఏమీ లేవని చెప్పడానికే ఏమో.. కానీ నీహారిక మెగా గ్లామర్ గేర్ వేసేసింది. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ హాట్‌ ఫోటోను పోస్ట్ చేసింది. “మీకు దేనివల్ల చిరునవ్వు వస్తుంది?” అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఒక బాలీవుడ్ హీరోయిన్ స్టైల్ లో జీన్ ప్యాంట్.. బటన్లు వేసుకోకుండా షర్టు ధరించి హాట్ పోజు ఇచ్చేసింది అమ్మడు.

నెటీజన్లకు నిద్రపట్టకుండా చేయడానికా ఏమో.. కిలకిలా నవ్వుతూ ఉంది. ఇంకేం మన నెటీజన్లు ఊరుకుంటారా.. “నీ స్మైల్ తో నాకు స్మైల్ వస్తుంది “.. “సూపర్ క్యూట్ మెగా హాట్” అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే.. ఇంత హాట్ నెస్ మెగా హీరోయిన్ నుంచి ఎవరూ ఊహించి ఉండరు.

View this post on Instagram

What makes you smile..?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్