వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌పై ఐసీసీ నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆప్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విష‌య‌మై నికోల‌స్ పూరన్ బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు.

నిషేధం కార‌ణంగా నికోలస్ పూరన్ వెస్టిండీస్ తరుపున నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఐదు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. దీంతో లక్నో వేదికగా వెస్టిండిస్ – ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య గురువారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో అతడు ఆడటం అనుమానమే.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.