మంచిర్యాలలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 11:01 AM GMT
మంచిర్యాలలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు..

మంచిర్యాల జిల్లాలో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా కలకలం రేపుతోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో డాక్టర్‌ నివాసంలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఇక్బాల్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఎన్‌ఐఏ బృందం సోదాలు చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్‌ నివాసంలో రెండు ఫోన్లు, హార్డ్‌ డిస్క్‌ విప్లవ సాహిత్యంతోపాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ మహిళా మావోయిస్టుకు వైద్యం అందించినట్లు ఆధారాలు ఉండడంతో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారని చంద్రశేఖర్‌ తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లో గవర్నమెంట్‌ డాక్టర్‌గా విధుల నిర్వర్తించానని తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుడిని అనే అనుమానంతో ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించి స్టేట్మెంట్‌ తీసుకున్నారని చంద్రశేఖర్‌ తెలిపారు.

Next Story
Share it