దిశ హత్య కేసు.. కీలక ఆధారాలు సేకరిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ..!

By అంజి  Published on  8 Dec 2019 10:07 AM GMT
దిశ హత్య కేసు.. కీలక ఆధారాలు సేకరిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ..!

రంగారెడ్డి: దిశ హత్య ఘటన నిందితుల తల్లిదండ్రులను జాతీయ మానవ హక్కుల బృందం విచారిస్తోంది. రాజ బహదూర్‌ వెంకటరామరెడ్డి తెలంగాణలో పోలీస్‌ అకాడమీలో ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు నిందితుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరో వైపు దిశ తల్లిదండ్రులకు జాతీయ మానవ హక్కుల బృందం నుంచి పిలుపు వచ్చింది. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందాన్ని దిశ తల్లిదండ్రులు కలవనున్నారు. విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల ఇచ్చే స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్‌ చేయనున్నారు. చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఇప్పటికే పరిశీలించింది. దిశ కేసుపై ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పలు వివరాలను నమోదు చేసుకున్నారు.

Next Story
Share it