'ఫోన్‌పే'లో అదిరిపోయే ఫీచర్

By సుభాష్  Published on  7 Feb 2020 3:05 PM IST
ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్

వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్‌పే, ఎంఐపే, పేటీఎం, టీ-వాలెట్‌ల కారణంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సులభతరమయ్యాయి. ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ ఫార్మర్‌ యాప్‌ అయిన ఫోన్‌ పే వినియోగదారులకు ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చాట్‌ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌ లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్‌ పంపుకోవచ్చు. వీరికి సులభంగా డబ్బులు పంపుకొనే అవకాశం ఉంటుంది. ఇతర యాప్‌లను వాడాల్సిన అవసరం లేకుండా ఫోన్‌పే యాప్‌లో ఉండే చాట్‌ ఫీచర్‌లోనే ఇతరులను డబ్బులు కావాలని కూడా అడగవచ్చు. అందులోనే ఇతరులతో చాట్‌ కూడా చేయవచ్చు.

కాగా, గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక గ్రూప్‌లో ఉండే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒకరికొకరు చాట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చిన ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై వాడుతున్న ఫోన్‌పేలో అందుబాటులో ఉందని ఫోన్‌పే పేర్కొంది.

Next Story