కొత్త లుక్‌తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 10:27 AM GMT
కొత్త లుక్‌తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ కోసం చేసిన ఫొటో షూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ కు స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది.

Related image

ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోనే విస్తరించబోతున్న స్ట్రీట్ వేర్ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది.

Next Story
Share it