నూతన సంవత్సరం వేడుకలు ఒక ఇంట్లో విషాదాన్ని నింపాయి. ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్ అతని కూతురు మరో నలుగురు లిఫ్ట్ కూలిన ఘటనలో చనిపోయారు. వివరాల్లోకి వెళితే న్యూ ఇయర్‌ సందర్భంగా ఇండోర్ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్‌ అగర్వాల్‌ పార్టీని ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్ తో  పాటు కొంత మంది లిఫ్ట్ ఎక్కారు. ప్రమాదవశాత్తు లిఫ్ట్ తీగ తెగిపోవడంతో వంద మీటర్ల ఎత్తు నుండి ఒక్కసారిగా క్రిందికి పడిపోయింది.

దాంతో లిఫ్ట్ లోని వారందరు కాంక్రీట్ గుంటలో పడిపోయారు. ఈ ప్రమాదంలో పునీత్ అగర్వాల్ , అతని కూతురు పాలక్, అల్లుడు పాల్కేష్ మనవడు నవ్ బంధువులు గౌరవ్, ఆర్యవీర్ ప్రాణాలు పోగుట్టుకున్నారు. ఈ ప్రమాధంలో గాయపడిన పునీత్ అగర్వాల్ భార్య నిది అగర్వాల్ పరిస్థితి ఆదోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పునీత్ అగర్వాల్ దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.