ఒక చైన్..ఒక గన్..ఇదే వర్మ ఆఫీస్.. అదిరిపోలా..?!!!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 8 Nov 2019 6:01 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన పేరు తెలియని వారుండరు. ఆయన ఏం చేసినా..ఏం మాట్లాడిన ప్రత్యేకత ఉంటుంది. తన అభిరుచులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అలవాట్లు ఇంకా చాలా డిఫరెంట్. ఒకరితో తనకు అనవసరం తనకు నచ్చింది తాను చేసుకుంటూ పోతాడు. తాజాగా హైదరాబాద్ లో ఆఫీస్ కట్టుకున్నాడు వర్మ. ఆఫీస్ అంటూ ఎలా ఉంటుంది. అద్దాలు..బయట నుంచి చూస్తే కాస్త స్మార్ట్ లుక్ ఉంటుంది. కాని వర్మ ఆఫీస్ మాత్రం..బయట నుంచి చూస్తే ..రౌడీల డెన్లా ఉంటుంది. బయట నుంచి చైన్ లు, తుపాకీ వేలాడుపడుతుంటాయి. బహుశ శివ సినిమాకు గుర్తుగా చైన్..తన మాఫియా సినిమా గుర్తుగా గన్ పెట్టుకుని ఉంటాడు. ఏదైనా అర్కిటెక్చర్ లో కూడా వర్మ తనదైన మార్క్ చూపించాడు. పైగా దానికి ఆర్జీవీ కంపెనీ అని ఇంగ్లిష్ కేపిటల్ లెటర్స్ తో పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు.
�
Next Story