కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 8:55 AM GMT
కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది. నవంబర్ 12019 నుంచి అక్టోబర్ 2021 వరకు కొత్త విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 2,216 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ఫీజు లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైన్‌ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. జనాభా ప్రాతిపదికన గతంలో ఉన్న 4 స్లాబ్‌లను 6 స్లాబ్‌లకు ప్రభుత్వం పెంచింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త లైసెన్స్‌లు అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్‌ విడుదల చేశారు.

Next Story