టీ 20లో మరో కొత్త రికార్డ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 7:10 AM GMT
టీ 20లో మరో కొత్త రికార్డ్

సింగపూర్‌: రికార్డ్‌లకు పుట్టినిల్లు క్రికెట్. ప్రతి రోజూ ఏదో రికార్డ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ చెలరేగిపోయాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా తన పేరు రికార్డ్‌ల్లో లిఖించుకున్నాడు. సింగపూర్‌ తన ముందు పెట్టిన విజయలక్ష్యం 152 పరుగులను నేపాల్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 16వ ఓవర్లో వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది.నేపాల్ కెప్టెన్ ఫరాస్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో సెంచరీ చేశాడు.

అంతర్జాతీ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగాడు. దాంతో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగపూర్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఇక్కడ నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. అంతేకాదు.. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతంగా ఈ ఫీట్‌ సాధించిన నాల్గో ఆసియా కెప్టెన్‌గా ఫరాస్ నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సింగపూర్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సింగపూర్ కెప్టెన్ టిమ్ డేవిడ్ 64 పరుగులతో నాటౌట్‌గా రాణించాడు. సురేంద్ర చంద్రమోహన్ 35పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

Next Story