చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రెజీనా. మొదట్లో పక్కంటి అమ్మాయి పాత్రలు చేయడంతో అవకాశాలు రాలేదు. తరువాత గ్లామరస్ మంత్రం జపించినా అరకొర అవకాశాలే వచ్చాయి. ‘అ!’ సినిమా నుంచి ఆమె కథల ఎంపిక శైలి మారింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘నేనే నా..?’ తాజాగా ఈ సినిమా ఫస్టు లుక్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. చిత్రబృంధానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

విడుదల చేసిన ఫస్టు లుక్‌లో ఇనుప రేకులతో కప్పి ఉన్న ఓ చిన్న గదిలో బంధించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె ఒంటికి రక్తం, కళ్లలో ఏదో బాధ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్టు లుక్‌ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. రాణి గెటప్‌లో ఉన్న రెజీనా .. అలా ఎందుకు ఉందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. కార్తిక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ స్టూడియోస్‌ పతాకం పై రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మిస్తున్నారు.

Nene Naa first look

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.